వర్మ లేకపోతే నేను లేను .. 'గులాబి' లేకపోతే నా కెరియర్ లేదు: జేడీ చక్రవర్తి
- 'శివ' సినిమాతో పరిచయమైన జేడీ చక్రవర్తి
- తాను నటన వైపుకు రావడానికి కారణం ఉత్తేజ్ అని వెల్లడి
- 'గులాబి' సినిమా తనని నిలబెట్టిందని వ్యాఖ్య
- మిగతా అవకాశాలు ఆ సినిమా తెచ్చిపెట్టిందన్న జేడీ
"నేను నటన వైపుకు రావడానికి కారకుడు ఉత్తేజ్. నన్ను వర్మకి పరిచయం చేసింది తనే. ఆ తరువాత నుంచి నేను అదే దార్లో ముందుకువెళ్లాను. నేను చేసిన సినిమాల్లో 'ఎగిరే పావురమా ' .. 'బొంబాయి ప్రియుడు' .. 'ప్రేమకు వేళాయెరా' సినిమాలన్నీ చెప్పుకోదగినవే. అయితే ఈ సినిమాలన్నీ నాకు రావడానికి కారణం 'గులాబి'నే.
'గులాబి' లేకపోతే 'ఎగిరే పావురమా' లేదు. 'బొంబాయి ప్రియుడు'లో రాఘవేంద్రరావు నన్ను పెట్టుకోవడానికి కారణం కూడా అదే. ఆ సినిమా నా కెరియర్ కి పునాది వేసింది. ఆ సినిమాకి నిర్మాత వర్మ అయితే .. కృష్ణవంశీ దర్శకుడు. వర్మ లేకపోతే నేను లేను .. 'గులాబి' లేకపోతే నాకు కెరియర్ లేదు" అంటూ చెప్పుకొచ్చాడు.