Pavan Kalyan: థీమ్ ఆఫ్ 'బ్రో' .. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!

Theme of BRO lyrical song video released
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ - సాయితేజ్ హీరోలుగా 'బ్రో' సినిమా రూపొందింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సముద్రఖని దర్శకత్వం వహించాడు. తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చడం విశేషం.

ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి, థీమ్ ఆఫ్ 'బ్రో' లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. పవన్ పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. కాలం నేపథ్యంలో నడిచే కాన్సెప్ట్ కి తగినట్టుగా, పవన్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ పాట సాగింది. 

తమన్ బాణీలను సమకూర్చిన ఈ పాటకి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. 'బ్రో' టైటిల్ ను లింక్ చేస్తూ పాటను రాసిన తీరు బాగుంది. తమన్ స్వరపరిచిన బీట్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అవుట్ పుట్ ను చూస్తుంటే, థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Pavan Kalyan
Sai Tej
Trivikram Srinivas
Samudrakhani
BRO

More Telugu News