Pavan Kalyan: థీమ్ ఆఫ్ 'బ్రో' .. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!

  • ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న 'బ్రో'
  • అంచనాలు పెంచుతూ వెళుతున్న అప్ డేట్స్ 
  • థీమ్ బీట్ తో మెప్పించిన తమన్
  • అదనపు బలంగా నిలవనున్న త్రివిక్రమ్ డైలాగ్స్  
Theme of BRO lyrical song video released

పవన్ కల్యాణ్ - సాయితేజ్ హీరోలుగా 'బ్రో' సినిమా రూపొందింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సముద్రఖని దర్శకత్వం వహించాడు. తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చడం విశేషం.

ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి, థీమ్ ఆఫ్ 'బ్రో' లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. పవన్ పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. కాలం నేపథ్యంలో నడిచే కాన్సెప్ట్ కి తగినట్టుగా, పవన్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ పాట సాగింది. 

తమన్ బాణీలను సమకూర్చిన ఈ పాటకి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. 'బ్రో' టైటిల్ ను లింక్ చేస్తూ పాటను రాసిన తీరు బాగుంది. తమన్ స్వరపరిచిన బీట్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అవుట్ పుట్ ను చూస్తుంటే, థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి.

More Telugu News