Ivana: ఇవాన మూవీ LGM కోసం వెయిట్ చేస్తున్న యూత్!

  • 'లవ్ టుడే'తో ఇవానకి యూత్ లో క్రేజ్ 
  • తెలుగులో నేరుగా చేసిన 'సెల్ఫిష్' మూవీ
  • ఆగస్టు 4న విడుదల కానున్న 'LGM'
  • హిట్ పడితే ఇవాన గ్రాఫ్ మారినట్టే  
Ivana Special

ఇవాన ఓ మలయాళ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది. ఆ తరువాత 'లవ్ టుడే' సినిమాతో తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే టైటిల్ తో ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

ఆ సినిమాలో ఆమె చెప్పిన 'బుజ్జికన్నా' డైలాగ్ బాగా పాప్యులర్ అయింది. నటన పరంగా .. గ్లామర్ పరంగా కూడా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరువాత తెలుగులో 'సెల్ఫిష్' అనే మరో సినిమా చేసింది. తెలుగులో ఆమె ఫస్టు మూవీ ఇదే. అయితే ఇది ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన 'LGM' విడుదలకు రెడీ అవుతోంది. 

ధోని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను ఆగస్టు 4వ తేదీన విడుదల కానుంది. ఇవానను మళ్లీ స్క్రీన్ పై చూడాలని ఆశపడుతున్న కుర్రాళ్లంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడి నుంచి మరిన్ని అవకాశాలు ఆమెకి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది మరి.

More Telugu News