Uttar Pradesh: పొలంలో కనిపించిన యుద్ధ విమానం ఇంధన ట్యాంక్.. స్థానికుల షాక్

  • ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • భారత వాయుసేన యుద్ధవిమానంలో సమస్యతో ఇంధన ట్యాంక్ జారవిడిచిన పైలట్
  • శిక్షణ కార్యక్రమంలో అనుకోకుండా ఈ ఘటన జరిగిందని వాయుసేన ప్రకటన
Indian airforce Pilot dumps fuel tank in agricultural field in uttarpradesh

పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంధన ట్యాంకును చూసిన స్థానికులకు తొలుత అదేంటో అర్థంకాక హైరానా పడ్డారు. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ, వాయుసేనకు తెలియజేశారు. 

యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్ నేలపైకి జారవిడిచారని వైమానిక దళ అధికారులు తెలిపారు. సాధారణ యుద్ధ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విమానం ఆ గ్రామ పరిసరాల్లో పయనిస్తుండగా ఈ సమస్య తలెత్తిందన్నారు. అది జాగ్వార్ యుద్ధ విమానమని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News