బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పెన్షన్: ఈటల రాజేందర్
- కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే
- మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా పేదల కోసం ఖర్చు చేయడం లేదని ఆరోపణ
- బీజేపీ గెలిచాక సంపన్నులకు రైతు బంధు తీసేస్తామని వెల్లడి
- పేదల పైసలకు బీజేపీ ప్రభుత్వం కాపలాగా ఉంటుందని వ్యాఖ్య
బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. సంపన్నులకు రైతు బంధు, రైతు బీమాను తీసేస్తామని, కేవలం పేదలకు, మధ్యతరగతికి ప్రజలకు మాత్రమే అందిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేదల పైసలకు కాపాలదారుగా ఉంటామన్నారు. తెలంగాణలో వాడవాడలా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయన్నారు.