Indian-2: కళ్లు చెదిరే భారీ ధరకు కమలహాసన్ ఇండియన్-2 డిజిటల్ రైట్స్!

  • శంకర్ దర్శకత్వంలో భారతీయుడు చిత్రానికి సీక్వెల్
  • కమల్ కెరీర్ లో మరో భారీ చిత్రం
  • నెట్ ఫ్లిక్స్ కు ఇండియన్-2 డిజిటల్ హక్కులు!
  • దాదాపు రూ.200 కోట్లకు డీల్!
Kamal Haasan starring Indian 2 movie digital rights garnered huge sum as per reports

శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న ఇండియన్-2 సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శంకర్ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్న కమల్ ఇటీవల ఆయనకు రూ.8 లక్షల విలువైన వాచీని గిఫ్టుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. 

కాగా, ఇండియన్-2 చిత్రానికి సంబంధించి తాజా సమాచారం తెరపైకి వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియన్-2 డిజిటల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ ఇండియన్-2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.

More Telugu News