tomato: మెక్‌డొనాల్డ్స్ దారిలో సబ్‌వే ఇండియా.. మెనూ నుండి టమాటాలు ఔట్!

subway india goes the mcdonalds way drops tomatoes from menu
  • నాణ్యతా సమస్య కారణంగా టమాటా వినియోగాన్ని నిలిపివేసినట్లు వెల్లడి
  • టామాటాలు తాత్కాలికంగా అందుబాటులో లేవని ఢిల్లీ విమానాశ్రయంలో బోర్డు
  • ఇప్పటికే టమాటాను మెనూ నుండి తొలగించిన మెక్ డొనాల్డ్స్
టమాటా ధరలు అత్యధికంగా ఉండటంతో మెక్ డొనాల్డ్స్ దారిలోనే సబ్‌వే ఇండియా సంస్థ కూడా నడుస్తోంది. తమ ఔట్‌లెట్స్‌లో తమ సలాడ్స్ మరియు శాండ్‌విచ్‌లలో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. నాణ్యతా సమస్య కారణంగా టమాటా వినియోగాన్ని నిలిపివేసినట్లు న్యూఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో కొన్ని సబ్‌వే ఔట్‌లెట్‌లలో డిస్ ప్లే బోర్డు పెట్టింది. 

ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌లోని సబ్‌వే స్టోర్ లో 'టమాటాలు తాత్కాలిక అందుబాటులో లేవు' అని కస్టమర్లకు బోర్డును ప్రదర్శించింది. ప్రస్తుతం వాటి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తగినంత టమాటాలను సోర్స్ చేయలేకపోతున్నామని పేర్కొంది. టమాటా చాలా ఖరీదుగా మారిందని సబ్ వే స్టోర్ ఉద్యోగిని ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.

టమాటా ధరలు దేశంలోని ఇతర ఫాస్ట్ ఫుడ్ చైన్‌లను ప్రభావితం చేశాయి. మెక్‌డొనాల్డ్స్ ఇటీవల తమ మెనూ నుండి, బర్గర్ నుండి టమాటాను తొలగించింది. నాణ్యతా ప్రమాణాలు కొరవడినందున టమాటాను నిలిపివేసినట్లు మెక్ డొనాల్డ్ అప్పుడే ప్రకటించింది. అకాల వర్షాలు, రవాణాలో అంతరాయం కారణంగా టమాటా ధర భారీగా పెరిగింది. ఇటీవల ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.240కి చేరుకుంది. ప్రస్తుతం అది రూ.170 దిగువకు వచ్చింది.
tomato
subway india
New Delhi

More Telugu News