భారత చైతన్య యువజన పార్టీ... ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన రామచంద్ర యాదవ్
- గుంటూరు నాగార్జున వర్సిటీ వద్ద ప్రజా సింహగర్జన సభ
- కొత్త పార్టీ పేరు ప్రకటించిన రామచంద్ర యాదవ్
- సభకు హాజరైన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్
ఈ సభకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, ఢిల్లీ వర్సిటీ ఫ్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్ తదితరులు హాజరయ్యారు.
ఈ సభలో రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవ్వాలని అన్నారు.