Kanguva: 'కంగువ' చిత్రం నుంచి సూర్య ఫస్ట్ లుక్ విడుదల... గ్లింప్స్ మామూలుగా లేదు!

First look and glimpse from Kanguva released
షార్ట్స్‌లో చూడండి
తమిళ కథనాయాకుడు సూర్య ప్రధాన పాత్రలో వస్తున్న ఎపిక్ మూవీ కంగువ. ఈ చిత్రం నుంచి నేడు సూర్య ఫస్ట్ లుక్ రిలీజైంది. ఖడ్గాన్ని చేతబూని గుర్రంపై రౌద్రరసం ఉట్టిపడేలా ఉన్న సూర్యను ఈ ఫస్ట్ లుక్ లో చూడొచ్చు. 

కంగువ.... ఒక యోధుడు, ఒక నాయకుడు, ఒక రాజు... అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, గ్లింప్స్ ఆఫ్ కంగువ పేరిట వీడియోను కూడా చిత్రబృందం పంచుకుంది. కంగువ థీమ్ సాంగ్ వినిపిస్తుండగా, వీరోచిత పోరాట దృశ్యాలతో ఈ గ్లింప్స్ సూర్య అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. 

పలు భాషల్లో తెరకెక్కుతున్న కంగువ చిత్రానికి శివ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో సూర్య సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Kanguva
Suriya
First Look
Glimpse
Kollywood

More Telugu News