పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య రహస్య బంధాలు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి: అంబటి

Ambati Rambabu slams Pawan Kalyan and Chandrababu
జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్, చంద్రబాబు రహస్య బంధాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం పవన్, చంద్రబాబు కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. 

పవన్ కల్యాణ్ పూటకో మాట మాట్లాడుతుంటాడని, అలాంటి పవన్ కల్యాణ్... చంద్రబాబుతో కలిసి తమను ఏమీ చేయలేరని అంబటి స్పష్టం చేశారు. సొంత రాష్ట్రంలో ఇల్లు లేని పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎన్నికలవగానే హైదరాబాద్ వెళ్లిపోవాల్సిందేనని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, అందుకే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. మరోవైపు వివేకా హత్య కేసును అదే పనిగా ప్రస్తావిస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
Go Back to Shorts
Ambati Rambabu
Pawan Kalyan
Chandrababu
YSRCP
Volunteer
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News