'భోళాశంకర్' మెగా ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిత్రం
  • ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కానున్న భోళాశంకర్
  • ఈ నెల 27న ట్రైలర్ విడుదల
ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న చిత్రం భోళాశంకర్. ఆచార్య, గాడ్ ఫాదర్ తరహాలో సీరియస్ కథాంశం కాకుండా, భోళాశంకర్ లో మాస్ ఎంటర్టయినింగ్ అంశాలు పుష్కలంగా ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఆగస్టు 11న భోళాశంకర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

కాగా, ఈ నెల 27న భోళాశంకర్ నుంచి మెగా ట్రైలర్ విడుదల కానుందని చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. అభిమానులూ... మెగా ఎంటర్టయినింగ్ యాక్షన్ కోసం గెట్ రెడీ అంటూ దర్శకుడు మెహర్ రమేశ్ అప్ డేట్ ఇచ్చారు. 

ఈ సినిమా కోసం మహతి స్వరసాగర్ బాణీలు కట్టిన పాటలు ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంటున్నాయి. భోళాశంకర్ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మరో అందాలభామ కీర్తి సురేశ్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.

Bhola Shankar
Trailer
Chiranjeevi
Meher Ramesh
Tollywood

More Telugu News