తెలుగు షట్లర్​ సాత్విక్​ మరో సంచలనం.. కొరియా ఓపెన్‌లో విజయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు షట్లర్​ సాత్విక్​ మరో సంచలనం.. కొరియా ఓపెన్‌లో విజయం

Satwik and Chirag Win Korea opened for the first time
  • ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ జంటపై గెలుపు
  • చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం
  • కెరీర్‌‌లో మూడో సూపర్ 500 టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్
భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ తన ఆటతో మరోసారి రికార్డు సృష్టించాడు. కొన్నాళ్లుగా చిరాగ్ షెట్టితో కలిసి సంచలన ఆటతీరు కనబరుస్తున్న సాత్విక్ కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లోనూ తొలిసారి విజేతగా నిలిచాడు. పురుషుల డబుల్స్ లో సాత్విక్, చిరాగ్ జోడీ.. ప్రపంచ నంబర్ వన్ జంట అల్పియాన్ -అర్డినాంటోతో వీరోచితంగా పోరాడి విజయం సాధించింది. ఫైనల్లో మూడో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ జంట 17–21, 21–13, 21–14తో ఇండోనేసియాకు చెందిన టాప్ సీడ్ జంటను ఓడించింది. 

తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ తర్వాతి రెండు గేమ్స్‌లో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. సాత్విక్–చిరాగ్ కెరీర్‌‌లో ఇది మూడో సూపర్‌‌500 టైటిల్ కావడం విశేషం. ఇదివరకు థాయిలాండ్ ఓపెన్ (2019), ఇండియా ఓపెన్ (2022) గెలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో స్విస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్ గెలిచిన అతను ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
Advertisement
badminton
satwik sairaj
chirag shetty
korea open

More Telugu News