IPL: పదేళ్లుగా సహజీవనం చేస్తున్న స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న సన్‌ రైజర్స్ కెప్టెన్​

  • నికోల్‌తో ఘనంగా వివాహ వేడుక
  • ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన మార్‌‌క్రమ్
  • అతని కెప్టెన్సీలో నిరాశ పరిచిన సన్‌ రైజర్స్
SRH captain Aiden Markram marries long time girlfriend Nicole

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు నికోల్ ను వివాహం చేసుకున్నాడు. వీళ్ల వివాహం శనివారం సెంచూరియన్‌లో ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను నికోల్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

ఈ ఇద్దరూ 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గతేడాదే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నికోల్ ఆన్‌లైన్ వేదికగా ఓ జ్యూవెలరీ స్టోర్‌ను నడుపుతోంది. మార్‌‌ క్రమ్ 2023 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, మార్ క్రమ్ సారథ్యంలో సన్‌రైజర్స్ తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

More Telugu News