Josephine Chaplin: నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లిన్ కుమార్తె కన్నుమూత

Charlie Chaplins Daughter Josephine Dies In Paris
  • 74 ఏళ్ల వయసులో కన్నుమూసిన జోసెఫిన్ చాప్లిన్
  • ఈ నెల 13న పారిస్‌లో మృతి 
  • చాప్లిన్ 8 మంది సంతానంలో జోసెఫిన్ మూడోవారు
ప్రపంచ దిగ్గజ హాస్యనటుడు, నవ్వుల రేడు చార్లీచాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల 13న పారిస్‌లో ఆమె మృతి చెందారు. 28 మార్చి 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జోసెఫిన్ జన్మించారు. 

చార్లీ చాప్లిన్-ఊనా ఓ నీల్‌ దంపతుల 8 మంది సంతానంలో ఆమె మూడో వారు. 1952లో తన తండ్రి సినిమా ‘లైమ్‌లైట్’తో చిన్న వయసులోనే తెరంగేట్రం చేశారు. 1972లో అవార్డు విన్నింగ్ సినిమా ‘పీర్ పావలో పాసోలిని’తోపాటు మరెన్నో సినిమాల్లో దిగ్గజ నటులతో కలిసి నటించారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమె మృతికి హాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Josephine Chaplin
Charlie Chaplin
Limelight
Oona O'Neill

More Telugu News