Thiruveer: 'పరేషాన్' మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇచ్చేసిన సోనీ లివ్!

Pareshan movie streaming date confirmed
  • తిరువీర్ హీరోగా రూపొందిన 'పరేషాన్'
  • కామెడీ ప్రధానంగా సాగే కంటెంట్
  • జూన్ 2న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఆగస్టు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్
తిరువీర్ నటుడిగా ఎదుగుతూ వస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన 'మసూద' మంచి మార్కులను కొట్టేసింది. హీరోగా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'పరేషాన్'. జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. 

ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సోనీ లివ్'వారు దక్కించుకున్నారు. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో తిరువీర్ జోడీగా పావని కరణం నటించింది.

సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ  సినిమాకి రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించాడు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. థియేటర్స్ నుంచి యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. మరి ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.  
Thiruveer
Pavani Karanam
Pareshan Movie

More Telugu News