Thota Chandrasekhar: వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి ఉంది: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

AP people are suffering in YSRCP ruling says BRS leader Thota Chandra Sekhar
  • టీడీపీ, వైసీపీలు ప్రజలను మోసం చేశాయన్న తోట చంద్రశేఖర్
  • రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ అవతరించిందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ లో చేరిన పలువురు మైనార్టీ నేతలు
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అసమర్థ పాలనలో సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని... మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.

తెలుగుదేశం, వైసీపీ మోసపూరిత వాగ్దానాలతో ఏపీ ప్రజలు వంచనకు గురయ్యారని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ అవతరించిందని చెప్పారు. గుంటూరు జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా జోనల్ ఇన్చార్జి నాగుల్ మీరాతో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 
Thota Chandrasekhar
BRS
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News