Nara Lokesh: ఇట్లు... షర్మిల ఫ్యాన్స్ అని ఫ్లెక్సీ వేయించమంటావా?: సీఎం జగన్ కు లోకేశ్ సవాల్

  • కనిగిరిలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • వర్షాన్ని లెక్కచేయకుండా తరలివచ్చిన ప్రజానీకం
  • కనిగిరి పామూరు బస్టాండు వద్ద భారీ బహిరంగ సభ
  • ఐప్యాక్ ప్లాన్ కూడా ఫెయిలైందన్న లోకేశ్
  • తాము ఫ్లెక్సీలు పెడితే జగన్ గుండె ఆగి చస్తాడని ఎద్దేవా
Nara Lokesh challenges Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కనిగిరిలో జనసంద్రంగా మారింది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టణ ప్రజలు రోడ్ల వెంట నిలబడి అపూర్వ స్వాగతం పలికారు. 160వ రోజు పాదయాత్ర కనిగిరి శివారు శంకవరం నుంచి ప్రారంభం కాగా, అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. కనిగిరి పామూరు బస్టాండులో బహిరంగసభ జన ప్రభంజనాన్ని తలపించింది. శుక్రవారం నాడు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్ర అక్కడ మూడు రోజుల పాటు కొనసాగనుంది.

కనిగిరిలో నారా లోకేశ్ ప్రసంగం హైలైట్స్...

యువగళాన్ని అడ్డుకునేందుకు జగన్ అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు, నా యాత్రకి ఐప్యాక్ టీంని పంపిస్తే మన వాళ్లు పట్టేశారు, యువగళం మొత్తం లైవ్ లో వస్తుంది సైకో జగన్, ఐప్యాక్ ఇక్కడికొచ్చి ఏం పీకుతుంది? 

ఇప్పుడు ఐప్యాక్ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది. వెంటనే ప్యాలస్ బ్రోకర్ సజ్జలను పిలిచి జగన్ చితకబాదాడు. "ప్రకాశం జిల్లాలో యువగళం ప్రభంజనంలా సాగుతుంది.... అడ్డుకోవడానికి ఏదో ఒకటి చెయ్యి" అని చెప్పాడు. వెంటనే ప్యాలస్ బ్రోకర్ వైసీపీ నేతల్ని, వాలంటీర్లను రంగంలోకి దింపాడు. 

అర్ధరాత్రి దొంగల్లా ఫ్లెక్సీలు పెడితే మన వాళ్లు పట్టేశారు. వాళ్లకి ఫ్లెక్సీలు వెయ్యడం కూడా రాదు. అందుకే అనేది వైసీపీ ఒక చిల్లర పార్టీ. ఫ్లెక్సీలు మేము పెట్టలేమా? మేము పెడితే నువ్వు గుండె ఆగి చస్తావ్. 

'జగన్ ఒక దొంగ... షర్మిలే వైఎస్ నిజమైన వారసురాలు.... ఇట్లు షర్మిల ఫ్యాన్స్' అని ఫ్లెక్సీ వేయించమంటావా? 'అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు కొంటాడా? ఇట్లు విజయలక్ష్మి ఫ్యాన్స్' అని ఫ్లెక్సీ వేయించమంటావా? 

మిస్టర్ జగన్... మమ్మల్ని కెలకొద్దు... నీకు నిద్ర లేకుండా చేస్తాం. నీకు ముందే చెప్పా... సాగనిస్తే పాదయాత్ర.... అడ్డుకుంటే దండయాత్ర అని. కానీ ఇప్పుడు స్లోగన్ మార్చాను. సాగనిస్తే పాదయాత్ర... కెలికితే వైసీపీకి అంతిమయాత్ర.

జగన్ టెన్త్ ఫెయిల్... కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్ లెవల్లో డైలాగులు!

చంచల్ గూడా జైల్ స్టూడెంట్ నంబర్ 6093 ఈ మధ్య జబర్దస్త్‌ కామెడీ చేస్తున్నాడు. మన యూనివర్సిటీలు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ తో పోటీపడాలి అంటున్నాడు. అది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా? అరకులోయ డిగ్రీ కాలేజ్ లో పైకప్పు కూలింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ పరిగెత్తి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పులిరాముడిగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ లో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ ని హత్య చేశారు. 

స్కూళ్ల‌లో టీచ‌ర్లు లేరు... చాక్ పీసుల‌కి దిక్కులేదు. యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశాడు. యూనివర్సిటీలకు చెందిన రూ.150 కోట్ల నిధులు పక్కదారి పట్టించాడు. టెన్త్ ఫెయిల్ జగన్ నీకు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి భారీ డైలాగులు అవసరమా...?

మధుసూదన్ కాదు... మనీసూదన్!

కనిగిరిని కనకగిరి గా మార్చేస్తారని మీరు మధుసూదన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించారు. మధుసూదన్ పాలనలో కనిగిరిలో అభివృద్ధి నిల్లు.... అవినీతి ఫుల్లు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియాకి కనిగిరిని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఆయన అవినీతి గురించి తెలుసుకున్న తరువాత ఆయనకి మనీ సూధన్ అని పేరు పెట్టాను. 

నియోజకవర్గంలో ఏ పని జరగాలి అన్నా మనీసూదన్ గారికి 20 శాతం కప్పం కట్టాల్సిందే. మనీసూదన్ సెంటు స్థలాల పేరుతో భారీ స్కాంకి పాల్పడ్డాడు. 45 ఎకరాలు... ఎకరం రూ.3 లక్షలకు కొని ప్రభుత్వానికి ఎకరం రూ.15 లక్షల చొప్పున అమ్మేసి రూ.6 కోట్లు కొట్టేశాడు. 

ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఉగ్ర నరసింహ!

కనిగిరి ప్రజల కష్టాలు తెలిసిన మంచి వ్యక్తి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి. ప్రజలు కష్టాల్లో ఉంటే పలకరించేది మన ఉగ్ర నరసింహారెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేషెంట్ కి ఏ మందు వేస్తే జబ్బు తగ్గుతుందో మన డాక్టర్ గారికి బాగా తెలుసు. అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎలా పరిష్కారం చెయ్యాలో కూడా ఆయనకే బాగా తెలుసు. 

వైసీపీ నాయకులకు హెచ్చరిక జారీచేస్తున్నా... మా ఉగ్ర నరసింహం జోలికి రావొద్దు, పొరపాటున వస్తే వేటాడేస్తాడు. రెడ్ బుక్ మా వద్ద ఉంది... చట్టాలు అతిక్రమించి అక్రమ కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2120.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ.*

*161 వరోజు (21-7-2023) పాదయాత్ర వివరాలు*

*మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*

మధ్యాహ్నం

12.00 – ఎర్రఓబునపల్లి క్యాంప్ సైట్ లో కమ్మ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

2.00 – ఎర్రబోయినపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

2.30 – మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

3.30 – పెద్దారికట్లలో స్థానికులతో సమావేశం.

సాయంత్రం

5.30 – చిన్నారికట్లలో స్థానికులతో సమావేశం.

7.45 – కంభాలపాలెంలో స్థానికులతో సమావేశం.

9.15 – పొదిలి శివారు పోతవరం విడిది కేంధ్రంలో బస.

******

More Telugu News