Seethakka: కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరం: సీతక్క

  • మణిపూర్ దారుణాలపై 79 రోజుల తర్వాత మోదీ స్పందించడం బాధాకరమన్న సీతక్క
  • బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరేం లేవని విమర్శ
  • మణిపూర్ లో అనేక దారుణాలు బయటకు రావడం లేదని వ్యాఖ్య
Seethakka fires on Modi

మణిపూర్ లో దారుణాలు జరుగుతున్న 79 రోజుల తర్వాత ప్రధాని మోదీ స్పందించడం బాధాకరమని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ప్రజలు తనపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించేందుకే మోదీ మాట్లాడారని అన్నారు. గత నెలలో రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనను కూడా బీజేపీ అడ్డుకుందని విమర్శించారు. కుకీ తెగపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలు బాధాకరమని చెప్పారు. పిల్లలు అని కూడా చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


బీజేపీవి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరేం లేవని సీతక్క దుయ్యబట్టారు. ఇలాంటివి కొత్తేమీ కాదనే విధంగా మణిపూర్ సీఎం మాట్లాడటం బాధాకరమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం పని చేయడం లేదని విమర్శించారు. మణిపూర్ లో జరుగుతున్న అనేక దారుణాలు బయటకు రావడం లేదని... సైన్యం, మీడియా అంతా బీజేపీ చేతుల్లోనే వున్నాయని చెప్పారు. మణిపూర్ ప్రజలకు మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News