Netflix: భారతీయ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్

  • పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఎత్తేస్తున్న నెట్‌ఫ్లిక్స్
  • ఇకపై ఇంట్లోని వారికి మాత్రమే పరిమితం
  • పాస్‌వర్డ్ షేర్ చేస్తున్న వారికి ఈమెయిల్స్ పంపిన నెట్‌ఫ్లిక్స్
Netflix shocking decision ends password sharing

భారతీయ వినియోగదారులకు ప్రముఖ స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్‌ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ఒక్క కుటుంబానికే పరిమితం అవుతుంది. అది కూడా నేటి నుంచే అమలు చేస్తున్నట్టు సమాచారం. 

పాస్‌వర్డ్‌ను ఎవరికి పడితే వారికి షేర్ చేస్తుండడంతో ఆదాయానికి గండిపడుతోందని భావించిన నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాస్‌వర్డ్‌ను కుటుంబంతో కాకుండా బయటి వ్యక్తులకు షేర్ చేస్తున్న యూజర్లకు ఈ-మెయిల్స్ పంపింది. ఇకపై ఇంట్లోని వారు (కుటుంబ సభ్యులు) మాత్రమే పాస్‌వర్డ్ ఉపయోగించుకోగలుగుతారని, ఎక్కడైనా, ఏ ప్రదేశంలోనైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.  

ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి వంద దేశాలు సహా బిజినెస్ రంగాల్లో పాస్ వర్డ్ షేరింగ్‌పై ఈ ఏడాది మే నెలలోనే నెట్‌ఫ్లిక్స్ పరిమితులు విధించింది. ఇప్పుడు ఇండియాకు దీనిని విస్తరించింది.

More Telugu News