హ్యాపీ మూడ్లో సమంత.. అభిమానుల సంబరం
- గుడ్ మార్నింగ్ చెబుతూ సమంత షేర్ చేసిన ఫొటో వైరల్
- పిల్లి పిల్లతో కలిసి బెడ్ మీద ఉన్న ఫొటో షేర్ చేసిన వైనం
- సమంత ముఖంలో నూతనోత్సాహం
- అభిమానులు ఫుల్ ఖుష్
అయితే, ధ్యానమార్గంలో ప్రయాణిస్తున్న సమంతకు ఓ కొత్త ప్రశాంతత దక్కిందో ఏమో గానీ ఆమె తాజాగా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. గెలాటో మార్నింగ్ అంటూ అభిమానులకు విషెస్ చెప్పారు. ఫుల్ ఛిల్ మూడ్లో ఉన్నానంటూ నేరుగా చెప్పేసింది. పిల్లి పిల్లతో బెడ్ మీద పడుకుని చిరునవ్వులు చిందిస్తున్న సమంత ఫొటో ఎప్పటిలాగే అభిమానులకు తెగ నచ్చేసింది. ఫ్యాన్స్ కూడా వందల సంఖ్యలో గుడ్ మార్నింగ్ మెసేజీలు, హార్ట్ సింబల్స్ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు.