500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న కోహ్లీ... ఆకాశ్‌చోప్రా ప్రశంసలు
- భారత్-విండీస్ మధ్య నేడు రెండో టెస్టు
- ఇరు జట్లకు ఇది వందో టెస్టు
- కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్
- విరాట్ సేవలకు తామందరం కృతజ్ఞతగా ఉంటామన్న ఆకాశ్ చోప్రా
- క్రికెట్‌కు అతడు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసలు
జియో సినిమాతో చోప్రా మాట్లాడుతూ.. ఆటపై కోహ్లీకి ఉన్న అంకితభావం చాలా స్పష్టంగా ఉందని, క్రికెట్ విషయానికి వస్తే అతడు ఓ సాధువులా జీవించాడని పేర్కొన్నాడు. కాబట్టే అతడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని అన్నాడు. ఈ బ్యూటిఫుల్ గేమ్‌కు అతడు బ్రాండ్ అంబాసిడరని కొనియాడాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు తామందరం అతడికి కృతజ్ఞతతో ఉండాలని తెలిపాడు.
ప్రపంచంలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లీ ఆరోస్థానంలో ఉండగా, అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కనున్నాడు.