Stock Market: 67 వేలకు పైన ముగిసిన సెన్సెక్స్.. 19,800 మార్క్ ను దాటిన నిఫ్టీ

  • వెల్లువెత్తుతున్న విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు
  • దూసుకుపోతున్న భారతీయ స్టాక్ మార్కెట్లు
  • 67,097కు ఎగబాకిన సెన్సెక్స్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో మన మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 302 పాయింట్ల లాభంతో 67,097కు చేరుకుంది. చరిత్రలో తొలిసారి 67 వేల పాయింట్లకు పైన ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 19,833కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.86%), బజాజ్ ఫైనాన్స్ (2.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.07%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.96%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.64%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-0.82%), భారతి ఎయిర్ టెల్ (-0.68%), మారుతి (-0.61%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.43%), నెస్లే ఇండియా (-0.36%).

More Telugu News