CHAIN SNATCHING: శేఖర్ కమ్ముల ఇంటి దగ్గర చైన్ స్నాచింగ్ ఘటన

  • వృద్ధురాలి మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దొంగ
  • పట్టపగలే నడి రోడ్డుపై చోరీ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
  • చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
CHAIN SNATCHING AT THE GATE OF SHEKHAR KAMMULAS HOUSE

సికింద్రాబాద్ లో పట్టపగలే దారుణం జరిగింది. వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును దొంగ లాక్కెళ్లాడు. పద్మారావునగర్ లో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంటి పక్కనే ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. వృద్ధురాలితో మాట్లాడుతున్న ఓ యువకుడు ఉన్నట్టుండి ఆమె మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. గొలుసును బలంగా లాగడంతో వృద్ధురాలు కిందపడిపోయింది. బంగారు గొలుసు చేజిక్కించుకున్న యువకుడు అక్కడి నుంచి పారిపోవడం వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటనపై బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చైన్ స్నాచర్ ను గుర్తించి వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



More Telugu News