Meta: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా వచ్చేసిన మెటా

Meta Launches Open Source AI Model Against ChatGPT And Google
షార్ట్స్‌లో చూడండి
సంచలనాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ, గూగుల్‌ బార్డ్ చాట్‌బాట్‌కు పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా రంగంలోకి దిగింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఫ్రీ ఆఫ్ చార్జ్ వెర్షన్‌ను నిన్న విడుదల చేసింది. చాట్‌జీపీటీ, బార్డ్ చాట్‌బాట్‌లకు ఫౌండేషన్‌గా వ్యవహరించే భాషా నమూనాలను ఓపెన్ఏఐ, గూగుల్ అభివృద్ధి చేశాయి. ఇవి మానవ సృజనాత్మకతను, నైపుణ్యాన్ని అనుకరిస్తూ ప్రపంచాన్ని తమవైపు తిప్పుకున్నాయి. 

ఇప్పుడు ఈ రెండు సంస్థలకు పోటీగా రంగంలోకి దిగిన మెటా జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విడుదల చేయడానికి బదులుగా రీసెర్చర్ల కోసం ప్రత్యేకంగా లామా అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది. ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే దాని అంతర్గత పనితీరు ఓపెన్ఏఐ, గూగుల్‌కు భిన్నంగా ఉంటుంది. 

ఇది ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తుందని, నూతన టెక్నాలజీ నిర్మాణం కోసం డెవలపర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని మెటా సీఈవో జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయ్యాక భద్రతను కూడా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ సరికొత్త శక్తిమంతమైన లామా 2గా పిలిచే ఈ మెటా మోడల్ వెర్షన్ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ద్వారా ఏ వ్యాపారానికైనా అందుబాటులో ఉంటుంది.
Go Back to Shorts
Meta
Llama
ChatGPT
Google
Open Source

More Telugu News