ఉప్పొంగుతున్న యమునా నది.. 45 ఏళ్ల తర్వాత తాజ్ మహల్ ను తాకిన వరద.. వీడియో ఇదిగో
- ఆగ్రాలో 495.8 అడుగులకు చేరిన యమున నీటిమట్టం
- తాజ్ వెనకున్న తోటను ముంచెత్తిన వరద నీరు
- ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయం గర్భగుడిలోకి చేరిన వరద
ఈ సందర్భంగా ఆగ్రా సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ స్పందిస్తూ... తాజ్ కాంప్లెక్ బయటి గోడలను యమున తాకిందని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఇది జరిగిందని అన్నారు. అయితే తాజ్ స్మారక చిహ్నంలోకి వరద నీరు ప్రవేశించే అవకాశం లేదని చెప్పారు. మరోవైపు వరద వల్ల తాజ్ కు ప్రమాదం లేకపోయినప్పటికీ... చుట్టు పక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది.