సాయి ధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం.. 6 నెలల పాటు సినిమాలకు దూరం
- యాక్సిడెంట్ తర్వాత కోలుకున్నప్పటికీ ఫిజికల్ గా ఇబ్బంది పడుతున్న తేజూ
- చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని వెల్లడి
- సర్జరీ కారణంగా కొత్త సినిమా కథలను కూడా వినలేదన్న మెగా హీరో
యాక్సిడెంట్ నుంచి కోలుకున్నప్పటికీ ఫిజికల్ గా తేజూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని తేజూ చెప్పాడు. సర్జరీ తర్వాత మరింత బలంగా, పూర్తి ఫిట్ నెస్ తో అభిమానుల ముందుకు వస్తానని తెలిపాడు. దీనికి ఆరు నెలల సమయం పట్టవచ్చని చెప్పాడు. సర్జరీ కారణంగా కొత్తగా సినిమా కథలను కూడా వినలేదని తెలిపాడు. బ్రేక్ తర్వాత దర్శకుడు సంపత్ నంది సినిమాలో నటిస్తానని వెల్లడించాడు. మరోవైపు, సమంత కూడా చికిత్స కోసం ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.