WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్... నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేయవచ్చు!

  • - iOS లేదా Android కోసం వాట్సాప్ తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి.
  • - వాట్సాప్ ను తెరిచి, స్టార్ట్ న్యూ చాట్ బటన్ పై ప్రెస్ చేయాలి
  • - సెర్చ్ బార్ లో కావాల్సిన నెంబర్ ను టైప్ చేయాలి.
  • - మీ కాంటాక్ట్ లో లేని నెంబర్ కోసం వెతికి, చాట్ పైన క్లిక్ చేయాలి.
  • - ఇప్పుడు మీరు సందేశాన్ని టైప్ చేసి, సెండ్ బటన్ ద్వారా చాటింగ్ ను ప్రారంభించవచ్చు.
WhatsApp rolls out feature to chat with unknown phone numbers

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అడ్రస్ బుక్ లో సేవ్ చేయకుండా, కొత్త నెంబర్లతో చాట్ ప్రారంభించే సౌకర్యాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఇది అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక నుండి కొత్త నెంబర్లను అడ్రస్ బుక్ లో సేవ్ చేసుకోకుండానే చాటింగ్ చేయడం సులభమవుతుంది.

వినియోగదారులు తొలుత వాట్సాప్ లో కాంటాక్ట్స్ లిస్ట్ ను ఓపెన్ చేసి, సెర్చ్ బార్ లో తెలియని లేదా అన్‌నోన్ నెంబర్ ను ఎంటర్ చేసి, శోధించాలి. ఆ కాంటాక్ట్ నెంబర్ కు వాట్సాప్ అకౌంట్ ఉంటే ఓపెన్ చాట్ బటన్ పై నొక్కి, అప్పుడు శోధించిన నెంబర్ తో చాట్ చేయవచ్చు.

సాధారణంగా అన్-నోన్ నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ లేదా చాట్ వచ్చినప్పుడు సేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ చెక్ చేసిన తర్వాత వాటి ఐడెంటిటీని తెలుసుకుంటారు. ఆ తర్వాత నెంబర్ డిలీట్ చేయకపోవచ్చు. దీంతో తెలియని వ్యక్తులు మీ ప్రొఫైల్ పిక్స్, వాట్సాప్ అప్ డేట్స్ చూసే అవకాశం ఉంటుంది. 

ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకుండానే శోధించడం అదనపు ప్రైవసీగా చెప్పవచ్చు. అలాగే, గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వారు స్కామర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఫీచర్ వినియోగదారుడికి ప్రయోజనకరమని వాబీటాఇన్ఫో తెలిపింది. మరోవైపు, వాట్సాప్ మాతృసంస్థ మెటా యానిమేటెడ్ అవతార్ ఫీచర్ ని పరిచయం చేసే ప్రాసెస్ లో ఉంది.

సేవ్ చేయని నెంబర్ చాటింగ్ కోసం ఇలా చేయండి

- iOS లేదా Android యూజర్లు వాట్సాప్ తాజా వెర్షన్‌ కోసం అప్‌డేట్ చేయండి.
- వాట్సాప్ ను తెరిచి, స్టార్ట్ న్యూ చాట్ బటన్ పై ప్రెస్ చేయాలి
- సెర్చ్ బార్ లో కావాల్సిన నెంబర్ ను టైప్ చేయాలి.
- మీ కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్ కోసం వెతికి, చాట్ పైన క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు సందేశాన్ని టైప్ చేసి, సెండ్ బటన్ ద్వారా చాటింగ్ ను ప్రారంభించవచ్చు.

More Telugu News