Sensex: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న బుల్ జోరు.. 67 వేల మార్క్ ను టచ్ చేసిన సెన్సెక్స్

  • వెల్లువెత్తుతున్న విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు
  • 205 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 38 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ప్రతి రోజు మార్కెట్లు రికార్డులను తిరగరాస్తున్నాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్ల వెల్లువ, బ్యాంకింగ్ షేర్ల దూకుడుతో ఈరోజు కూడా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 205 పాయింట్లు లాభపడి 66,795కి చేరుకుంది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 19,749 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఒకానొక దశలో 67 వేల మార్క్ ను టచ్ చేసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (3.67%), ఏసియన్ పెయింట్స్ (1.51%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.18%), రిలయన్స్ (0.93%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.66%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.45%), టైటాన్ (-1.28%), బజాజ్ ఫైనాన్స్ (-1.18%), సన్ ఫార్మా (-1.08%), టాటా స్టీల్ (-1.02%).

More Telugu News