Magunta Raghava: లిక్కర్ స్కామ్ కేసు.. మాగుంట రాఘవకు బెయిల్

  • అనారోగ్య కారణాలతో 4 వారాలు మంజూరు చేసిన కోర్టు
  • ఈడీ అధికారుల విచారణకు సహకరించాలని షరతు
  • వారంలో రెండు రోజులు ఈడీ ఎదుట రిపోర్ట్ చేయాలని ఆదేశం
Deli High Court Sanctioned Bail to Magunta Raghava

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జైలులో ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో రాఘవకు నాలుగు వారాల పాటు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో రాఘవ బెయిల్ పిటిషన్ కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ.. ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. దీంతో హైకోర్టు రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కేసు విచారణలో అధికారులకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని హైకోర్టు తెలిపింది. చెన్నై సిటీకే పరిమితం కావాలని, పాస్ పోర్ట్ ను కోర్టుకు సరెండర్ చేయాలని, దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని పేర్కొంది.

More Telugu News