Project K: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొణే ఫస్ట్ లుక్ విడుదల.. అంచనాలు పెంచేసిన నాయిక!

  • సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్
  • ఈ నెల 20న అమెరికాలో సినిమా టైటిల్, గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్న మేకర్స్
  • 'ప్రాజెక్ట్ కే'లో 'కే' అంటే కాలచక్రం అని ప్రచారం
Deepika Padukone first look in Prabhas Project K released

ప్రభాస్ చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కే'. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణేకి చెందిన ఫస్ట్ లుక్ ను నిన్న రాత్రి మేకర్స్ విడుదల చేశారు. ఇందులో దీపిక ఎంతో సీరియస్ గా కనిపిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా టైటిల్ ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

రేపటి నుంచి యూఎస్ లోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరగనున్నాయి. అక్కడే ఈ నెల 20న సినిమా టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక, నాగ్ అశ్విన్, అశ్వనీదత్ పాల్గొననున్నారు. మరోవైపు 'ప్రాజెక్ట్ కే'లో 'కే' అంటే కాలచక్రం అనే ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయొచ్చని కూడా సమాచారం.

More Telugu News