ఆస్ట్రేలియా సముద్ర తీరంలో 'చంద్రయాన్-3'కి చెందిన వస్తువు?
- గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో కనిపించిన వింత వస్తువు
- రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న వస్తువును చూసి స్థానికుల ఆశ్చర్యం
- చంద్రయాన్-3 నుంచి విడివడిన వస్తువు అయ్యుండొచ్చని నెట్టింట టాక్
- మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ
ఈ వస్తువు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? అన్న విషయాలు తేల్చేందుకు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ కూడా రంగంలోకి దిగింది. విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది అయి ఉండొచ్చని అంచనా వేస్తోంది. అంతేకాకుండా, పలు దేశాలతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా, ఈ వస్తువు భారత్‌కు చెందిన పీఎస్ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించినది అని తాను అనుకుంటుంన్నట్టు అంతరిక్ష నిపుణురాలు డా. ఏలిన్ గార్మన్ తెలిపారు.