రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పాతాళానికి కాంగ్రెస్: పువ్వాడ అజయ్
- రేవంత్ చంద్రబాబు ఏజెంట్... టీడీపీ ప్రోడక్టేనని వ్యాఖ్య
- రైతులను సంక్షోభంలోకి నెట్టేసేందుకు కాంగ్రెస్ కుట్ర అని ఆరోపణ
- బీఆర్ఎస్ నాణ్యమైన విద్యుత్ ఇచ్చినప్పటికీ విమర్శలా? అని ప్రశ్న
రైతులకు మూడు గంటల విద్యుత్ అని రేవంత్ చెప్పారని, దీనిని మేనిఫెస్టోలో పెట్టగలరా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీని పాతాళంలోకి తీసుకు వెళ్ళాయన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని... ఆయన చూస్తూ చదివే రీడర్ అని ఎద్దేవా చేశారు.