Daggubati Purandeswari: నా దేశం ఇలా మారిపోయింది: పురందేశ్వరి

This is how my country changed says Daggubati Purandeswari
  • కేంద్రం 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందన్న పురందేశ్వరి
  • గతంలో మహిళలు పొగతో ఇబ్బందులు పడేవారని వ్యాఖ్య
  • ప్రధాని ఓ మహిళకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్న ఫొటో ట్వీట్ చేసిన బీజేపీ ఏపీ చీఫ్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మారిపోయిందంటూ కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని ఓ మహిళకు గ్యాస్ సిలిండర్ ను ఇస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘నా దేశం ఇలా మారిపోయింది! గతంలో మహిళలు పొయ్యి పొగతో ఇబ్బందులు పడాల్సి ఉండేది. ఇప్పుడు ఉజ్వల పథకం కింద మోదీ ప్రభుత్వం 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది” అని పేర్కొన్నారు.
Daggubati Purandeswari
Narendra Modi
BJP
Ujjwala scheme
free gas connections

More Telugu News