dayaa: జేడీ చక్రవర్తి ఈజ్ బ్యాక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా ‘దయా’ వెబ్ సిరీస్

JD Chakraborty is back with Suspense thriller Dayaa web series
  • హాట్ స్టార్ లో ఆగస్టు 4న స్ట్రీమింగ్ కానున్న సిరీస్
  • వ్యాన్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్న జేడీ
  • కీలక పాత్రల్లో ఈషా రెబ్బా, రమ్య నంబీశన్
క్లాస్, మాస్‌ క్యారెక్టర్లతో టాలీవుడ్‌ను కొన్నాళ్లు ఊపు ఊపిన నటుడు జేడీ చక్రవర్తి. కెరీర్ ఆరంభంలోనే హిందీలో సైతం గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పుడు ఓ తెలుగు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జేడీ చక్రవర్తితో పాటు ఈషా రెబ్బా, రమ్య నంబీశన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దయా’. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం విడుదలైన ట్రైలర్‌ సిరీస్‌పై అంచనాలు పెంచింది. ఓ వ్యాన్ డ్రైవర్‌‌ పాత్రలో జేడీ చక్రవర్తి కనిపించారు.


వ్యాన్ డ్రైవర్ జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. చాన్నాళ్ల తర్వాత  జేడీ చక్రవర్తి తన మార్కు నటనను చూపెట్టారు. జేడీ నడుపుతున్న వ్యాన్లో ఓ రోజు డెడ్ బాడీ కనిపిస్తుంది. అదే సమయంలో ఓ లెడీ జర్నలిస్ట్ మిస్ అవుతుంది. ఆ డెడ్ బాడీని మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సన్నివేశాలను ట్రైలర్‌‌లో చూపించారు. అసలు ఆ లేడీ రిపోర్టర్ ఎలా మిస్ అయింది? తన వ్యాన్ లో దొరికిన డెడ్ బాడీతో జేడీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు? అనే సన్నివేశాలతో  ట్రైలర్ మొత్తం సస్పెన్స్ గా ఉంది.
dayaa
JD Chakraborty
web series
hotstar

More Telugu News