హిందూ దేవాలయంపై రాకెట్ లాంచర్లతో దాడి.. పాకిస్థాన్‌లో దారుణం
- సింధ్ ఫ్రావిన్స్ కాష్మోరే ప్రాంతంలోని హిందూ దేవాలయంపై దాడి
- ఆదివారం తెల్లవారుజామున రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డ నిందితులు
- పోలీసుల రాకతో అక్కడి నుంచి పరార్
- రాకెట్లు పేలకపోవడంతో తప్పిన ప్రమాదం
- నిందితుల కోసం పోలీసుల విస్తృత గాలింపు
సుమారు తొమ్మిది మంది ఈ దాడికి పాల్పడినట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇష్టారీతిన కాల్పులకు తెగబడిన వారు పోలీసుల రాకను గుర్తించి పరారయ్యారన్నారు. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
పాకిస్థాన్‌కు చెందిన వివాహిత సీమా హైదర్ జఖ్రానీ భారత్‌లోని ఓ హిందూవ్యక్తితో ప్రేమలో పడి దేశం విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌లోని హిందువులపై బెదిరింపులు అధికమయ్యాయి. కాష్మోరే, ఘోట్కీ ప్రాంతాల్లోని హిందూ దేవాలయాలను లక్ష్యం చేసుకుంటామంటూ కొందరు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.