విమానం నుంచి చంద్రయాన్-3 ప్రయోగం రికార్డింగ్.. నెట్టింట వీడియో వైరల్
- నింగిలోకి దూసుకుపోతున్న చంద్రయాన్-3ని విమానం నుంచి రికార్డింగ్
- అస్త్రంలా దూసుకుపోయిన చంద్రయాన్
- నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న వీడియో
ఇస్రో రాకెట్ నింగిలోకి దూసుకెళుతుండగా విమానంలోంచి ఓ ప్రయాణికుడు రికార్డ్ చేశాడు. బ్రహ్మాస్త్రం తన లక్ష్యం దిశగా దూసుకుపోతున్నట్టు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇస్రో మెటీరియల్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డా. పీవీ వెంకటకృష్ణనన్ ఈ వీడియోను షేర్ చేశారు. చంద్రయాన్-3 ప్రయాణాన్ని వీక్షించాలంటూ ఆ విమానంలోని పైలట్ స్వయంగా ప్రయాణికులకు చెప్పినట్టు ఆయన తెలిపారు.