చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌డేట్
- మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన
- చంద్రయాన్-3 కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు శనివారం ప్రకటన
- ప్రస్తుతం చంద్రయాన్-3 41762 కి.మీ*173 కి.మీల కక్ష్యలో ఉన్నట్టు వెల్లడి
చంద్రుడి రహస్యాలు బయటపెట్టేందుకు ఇస్రో చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3. జూలై 14న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి దీన్ని దిగ్విజయంగా ప్రయోగించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన చేపట్టడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో చంద్రయాన్-3లోని లాండర్ విజయవంతంగా చంద్రుడిపై దింపాలని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ల్యాండర్ సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.