శామీర్ పేట్ క్లబ్ లో కాల్పుల కలకలం
- భర్తపై కాల్పులు జరిపిన భార్య ప్రియుడు
- పోలీసులను ఆశ్రయించిన భర్త
- పిల్లలను చూసేందుకే అక్కడికి వెళ్లినట్లు వివరణ
సిద్ధార్థ్ దాస్ దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇద్దరూ కొంతకాలంగా విడిగా ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే 2019 నుంచి సిద్ధార్థ్ భార్యతో మనోజ్ నాయుడు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. భార్య దగ్గర ఉన్న తన పిల్లలను తన సంరక్షణలోకి తీసుకోవడానికి సిద్ధార్థ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కను కొడుతున్నారంటూ కొడుకు ఫోన్ చేయడంతో సెలబ్రిటీ క్లబ్ కు వెళ్లానని సిద్ధార్థ్ దాస్ చెప్పారు. పిల్లలను చూసేందుకు వెళ్లానని, ఈ క్రమంలోనే గొడవ జరగగా మనోజ్ తనపై కాల్పులు జరిపాడని తెలిపారు.