ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఎన్జీటీ నిషేధం
- ఎన్జీటీ తీర్పును ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
- ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఇసుక తవ్వకాలను జయప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ కు ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను చేపడుతున్నారని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తవ్వకాలపై నిషేధం విధించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. నదీ తీరాలు, రివర్ బెడ్లలో భారీ యంత్రాలతో తవ్వకాలను అనుమతించడంపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.