Vijay Deverakonda: నా మ్యారేజ్‌ లైఫ్‌ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలి: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda wishes his  married life should be like this song
  • విజయ్, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా
  • సినిమాలోని ‘ఆరాధ్య’ పాట తనకెంతో ఇష్టమన్న విజయ్
  • సెప్టెంబర్ 1న విడుదల కానున్న చిత్రం

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. ఈ ప్రేమకథా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. లైగర్ డిజాస్టర్ తర్వాత  ఈ సినిమాపై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు అనారోగ్య కారణాలతో ఏడాది పాటు విరామం తీసుకోనున్న సమంతకు తెలుగులో ప్రస్తుతానికి ఇదే చివరి సినిమా కానుంది. సెప్టెంబర్ 1న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తోంది. తాజాగా ‘ఆరాధ్య’ అనే పాటను ఇటీవలే విడుదల చేసింది. ఇందులో పెళ్లి తర్వాత జంట మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. 

ఈ పాట గురించి విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఖుషి సినిమాలో ఇది తనకు ఇష్టమైన పాట అన్నాడు. పెళ్లయిన ఏడాది లోపు భార్యభర్తలు ఎలా ఉండాలి, వారి మధ్య అనుబంధం ఎలా వుండాలి? అన్నవి అద్భుతంగా చూపించారన్నాడు. భవిష్యత్తులో తన మ్యారేజ్‌ లైఫ్‌ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నానని విజయ్‌ తెలిపాడు. దాంతో, విజయ్ త్వరగా పెళ్లిచేసుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News