ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామన్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి
- ప్రభుత్వ ఉద్యోగుల 341 డిమాండ్లను పరిష్కరించినట్లు వెల్లడి
- పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ
- కరోనా సమయంలో చనిపోయిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు
ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ... పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు 1,042 ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నేతలు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.