రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లడానికి కారణం ఇదే: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డి తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారన్న మల్లారెడ్డి
- డబ్బులు భిక్షమెత్తుకోవడానికే అమెరికాకు వెళ్లారని ఆరోపణ
- పీసీసీ చీఫ్ పదవికే ఆయన ఒక సీఎంలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా
ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాట్లాడుతూ... రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పుట్టగతులు కూడా ఉండవని అన్నారు. రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుందని చెప్పారు. డబ్బుల కోసం భిక్షమెత్తుకోవడానికే రేవంత్ అమెరికాకు వెళ్లారని విమర్శించారు.
రేవంత్ ఒక దొంగ అని, దొంగకు పీసీసీ పగ్గాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. పీసీపీ చీఫ్ పదవి వస్తేనే ఆయన ఒక సీఎంలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల జోలికి వస్తే రేవంత్ కు పుట్టగతులు ఉండవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని... కేసీఆర్ రైతుల మేలు కోరే నాయకుడని చెప్పారు. బీఆర్ఎస్ అంటేనే రైతు సర్కార్ అని అన్నారు.