Anand Devarakonda: ఈ వారం థియేటర్స్ కి వస్తున్న సినిమాలివే!

  • టీనేజ్ లవ్ స్టోరీగా పలకరించనున్న 'బేబి'
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న 'నాయకుడు'
  • ఉదయ్ నిధి జోడీగా కనిపించనున్న కీర్తి సురేశ్ 
  • 'మహావీరుడు'గా రంగంలోకి శివకార్తికేయన్
New Movies Update

ఈ శుక్రవారం థియేటర్లకు మూడు సినిమాలు రానున్నాయి. వాటిలో 'బేబి' ఒక్కటే తెలుగు సినిమా కాగా, మిగతా రెండు సినిమాలైన 'నాయకుడు' .. 'మహావీరుడు' తమిళం నుంచి వచ్చిన అనువాదాలు. ఈ మూడు సినిమాలు కూడా కంటెంట్ పరంగా డిఫరెంట్ జోనర్స్ కి చెందినవే. ఒక సినిమాకి .. మరో సినిమాకి ఎక్కడా ఎలాంటి పోలికలు లేనివే. ఆనంద్ దేవరకొండ హీరోగా 'బేబి' సినిమా రూపొందింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను వైష్ణవి చైతన్య పోషించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఇది. ఎస్ కె ఎన్ నిర్మించిన ఈ సినిమాకి, సాయిరాజేశ్ దర్శకత్వం వహించాడు. విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, యూత్ ను ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి. ఇక ఉదయనిధి స్టాలిన్ - కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'మామనన్' జూన్ 29న తమిళనాట విడుదలైంది. వడివేలు కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, తెలుగులో 'నాయకుడు' టైటిల్ తో ఈ శుక్రవారం వదులుతున్నారు. శివకార్తికేయన్ హీరోగా రూపొందిన 'మహావీరుడు' కూడా ఈ వారమే బరిలోకి దిగుతోంది. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా అదితి శంకర్ అలరించనుంది.

More Telugu News