రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి!
- ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- గుజరాత్ నుంచి బాబూభాయ్, కేశ్రీదేవ్ సిన్హ్ కు అవకాశం
- బెంగాల్ నుంచి అనంత మహారాజ్ కు ఛాన్స్
ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 6 స్థానాలు, గుజరాత్ లో 3, గోవాలో 1 స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే గుజరాత్ నుంచి బీజేపీ తరపున నామినేషన్ వేశారు. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం.
