వింబుల్డన్ లో పెను సంచలనం... వరల్డ్ నెంబర్ వన్ ను ఇంటికి పంపిన ఉక్రెయిన్ అమ్మాయి
- ఇంటి ముఖం పట్టిన ఇగా స్వైటెక్
- క్వార్టర్ ఫైనల్లో ఎలినా స్విటోలినా చేతిలో ఓటమి
- సెమీస్ చేరిన స్విటోలినా
- స్విటోలినా వరల్డ్ 76వ ర్యాంక్ క్రీడాకారిణి
తొలి సెట్ ను స్విటోలినా చేజిక్కించుకోగా, రెండో సెట్ లో ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ బయటపడిన స్వైటెక్, ఆ సెట్ ను టైబ్రేకర్ లో గెలుచుకుంది. అయితే మూడో సెట్ లో అదే ఊపు కనబర్చడంలో విఫలమైన స్వైటెక్ ప్రత్యర్థికి తేలిగ్గా తలవంచింది. చివరి సెట్ లో స్విటోలినా పలుమార్లు స్వైటెక్ సర్వీస్ ను బ్రేక్ చేయడమే అందుకు నిదర్శనం.
కాగా, సెమీస్ లో స్విటోలినా... చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మార్కెటా వోండ్రొసోవాతో తలపడనుంది.