Lakshin: 'ధ్వని' షార్ట్ ఫిలిం.... దర్శకుడు పదేళ్ల బాలుడుంటే నమ్మలేరు!

  • ధ్వని షార్ట్ ఫిలిం తెరకెక్కించిన లక్షిన్
  • లక్షిన్ వయసు 10 ఏళ్లు
  • హైదరాబాదులో ధ్వని రిలీజ్ ఫంక్షన్
  • హాజరైన దర్శకుడు కరుణకుమార్, నిర్మాత బెల్లంకొండ సురేశ్
Lakshin ten years old boy directed Dhwani short film

పదేళ్ల బాలుడు షార్ట్ ఫిలిం తీయడం అంటే ఎవరికైనా అతిశయోక్తిగానే అనిపిస్తుంది. కానీ ఇది నిజం. లక్షిన్ అనే బాలుడు ధ్వని అనే షార్ట్ ఫిలిం రూపొందించి ఔరా అనిపించాడు. అంతేకాదు, అత్యంత పిన్న వయసులో షార్ట్ ఫిలిం తీసిన దర్శకుడిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కూడా సంపాదించాడీ చిచ్చరపిడుగు. 

ధ్వని షార్ట్ ఫిలిం రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కరుణకుమార్, నిర్మాత బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ధ్వని షార్ట్ ఫిలింను చెవిటి, మూగ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. 

ఎల్వీ ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ లఘు చిత్రానికి నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించారు. అశ్విన్ కురమన మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 

భవిష్యత్ లో టాలీవుడ్ డైరెక్టర్ అవ్వాలని, తన అభిమాన కథానాయకుడు అల్లు అర్జున్ తో సినిమా తెరకెక్కించాలన్నది లక్షిన్ ఆశయం. అంతేకాదు, తనకు 20 ఏళ్ల వయసు వచ్చేసరికి 20 షార్ట్ ఫిలింస్ తీయాలన్నది అతడి లక్ష్యం.

రిలీజ్ కార్యక్రమంలో లక్షిన్ మాట్లాడుతూ, ధ్వని షార్ట్ ఫిలిం తీయడం వెనుక తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని తెలిపాడు. తాను తీసిన లఘు చిత్రానికి మంచి స్పందన వస్తుండడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నాడు.

More Telugu News