హింట్ కాంబో రిపీట్.. గోపీచంద్ మలినేనితో రవితేజ నాలుగో సినిమా
- డాన్ శీను, బలుపు, క్రాక్ తో హ్యాట్రిక్ సాధించిన గోపీ, రవి
- మైత్రీ మూవీస్ నిర్మాణంలో మరో సినిమా ప్రకటన
- సంగీత దర్శకుడిగా తమన్
సినిమా ప్రకటనకు సంబంధించిన మోషన్ పోస్టర్ చూస్తుంటే రవితేజ కోసం గోపీచంద్ మరో పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. పోస్టర్లో ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, దేవాలయం, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.