CM Jagan: గండికోటలో ఒబెరాయ్ హోటల్ కు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్

CM Jagan to lay foundation stone for Oberoi Hotel in Gandikota
  • వైఎస్సార్‌ కడప జిల్లాలో రెండో రోజు పర్యటన
  • విశాఖ, తిరుపతిలో ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన
  • జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు 
వైఎస్సార్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు ఆదివారం కూడా పర్యటిస్తున్నారు. ఉదయం గండికోట చేరుకున్న సీఎం జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ, తిరుపతిలో నిర్మించనున్న ఒబెరాయ్ హోటళ్లకు గండికోట నుంచే వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ సింగ్ ఒబెరాయ్, ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆర్ కే రోజా, ఆదిమూలపు సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో పరుగులు పెడుతోందని అన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. 

ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కడప జిల్లా గండికోటతో పాటు విశాఖపట్నం, తిరుపతిలో ఒబెరాయ్ సంస్థ సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మిస్తోంది. ఈ హోటళ్ల నిర్మాణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం గండికోటలో వ్యూ పాయింట్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు.

అక్కడి నుంచి గరండాల రివర్ ఫ్రంట్ చేరుకుని గరండాల కెనాల్ డెవలప్ మెంట్ ఫేజ్-1 పనులను ప్రారంభిస్తారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఆపై పులివెందులలో న్యూటెక్ బయోసైన్స్ ను, మధ్యాహ్నం 2:30 గంటలకు వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
CM Jagan
Andhra Pradesh
gandikota
ysr kadapa
oberoi hotels
vishakapatnam
Tirupati

More Telugu News