South Central Railway: ప్రయాణికులకు గమనిక.. ఆ రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు

  • గత నెల 19న పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే
  • సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రోలింగ్ కారిడార్ బ్లాక్ కార్యాచరణ
  • పొడిగింపుపై అన్ని స్టేషన్లకు సమాచారం
South Central Railway Cancellation of those trains extended till 16th

వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రోలింగ్ కారిడార్ బ్లాక్ కార్యాచరణ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఈ నెల 16 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొంటూ అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.

రద్దయిన రైళ్లు ఇవే..

* కాజీపేట-డోర్నకల్ (07753)
* డోర్నకల్-కాజీపేట మెము (07754)
* డోర్నకల్-విజయవాడ (07755)
* విజయవాడ-డోర్నకల్ (07756)
* భద్రాచలం రోడ్-విజయవాడ (07278)
* విజయవాడ-భద్రాచలం రోడ్ (07979)
*  సికింద్రాబాద్-వరంగల్ (07462)
* వరంగల్-హైదరాబాద్ మెము (07463)
* కాజీపేట-సిర్పూరు టౌన్ (17003)
* బల్లార్షా-కాజీపేట రాంగిరి మెము (17004)
* భద్రాచలం రోడ్-బల్లార్షా (17033), 
* సిర్పూరు టౌన్-భద్రాచలం రోడ్ (17034)

More Telugu News